TDP-BJP: ఏలూరులో కూటమి నేతల మధ్య టికెట్‌ రగడ

ఏలూరు పార్లమెంట్‌లో ఆసంతృప్తి సెగలు కూటమిని కుదిపేస్తున్నాయి. బీజేపీ నేత గారపాటి సీతారామంజనేయ చౌదరిని ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన అనుచరులు, అభిమానులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ నేత పుట్టా మహేష్ కు సీటివ్వడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు.

New Update
TDP-BJP: ఏలూరులో కూటమి నేతల మధ్య టికెట్‌ రగడ

TDP-BJP: ఏలూరు పార్లమెంట్ లో ఆసంతృప్తి సెగలు కూటమిని కుదిపేస్తున్నాయి. జిల్లాలో కూటమి నేతల మధ్య టికెట్‌ రగడ నెలకొంది. టీడీపీ రాయలసీమ నేత పుట్టా మహేష్‌కు సీటివ్వడంతో అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి.  బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరిని ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరుల ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కేడర్‌తో తపన చౌదరి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

Also Read: ‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!

బీజేపీ నేత తపన చౌదరికి కాకుండా టికెట్ టీడీపీకి ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. మూడేళ్లుగా ఎంపీగా పోటీ చేసేందుకు గారపాటి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నారని..తపన చౌదరికి పార్టీలకతీతంగా మద్దతు కూడా పెరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, గారపాటి చౌదరికి బీజేపీ కైకలూరు అసెంబ్లీ సీటిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, అక్కడ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పోటీకి సిద్ధమవడంతో బీజేపీలో అంతర్మథనం కనిపిస్తోంది.

Also Read: కవితకు ఖైదీ నంబర్ 666.. డల్‌గా మొదటిరోజు

ఇదిలా ఉండగా.. గారపాటి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే తాము నష్టపోతామంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనలో చెందుతున్నారు. ఏలూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్
తీవ్ర అసంతృప్తిలో ఉన్న టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు వైసీపీలో చేరారు. దీంతో టీడీపీకి ఏలురులో బలం తగ్గినట్లేనని క్లియర్ గా అర్థమవుతోంది.మరి బీజేపీ నేత గారపాటి కూడా అసంతృప్తిలో పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం కూటమికి పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు