MP Ram Mohan: ప్రజల తలరాతలు మార్చడానికే పొత్తులు..! పొత్తులు రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చడానికేనన్నారు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ముచ్చటగా మూడోసారి తాను పార్లమెంట్ కు వెళ్లడం ఖాయమన్నారు. తన పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 09 May 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి MP Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. ఎంపీ రామ్మోహన్ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తిరుతారన్నారు. Also Read: టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్ము స్వాధీనం.. అధికారి లెక్కలపై అనుమానాలు..! ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. పొత్తులు రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చడానికేనన్నారు. జలగలను హతమార్చడానికి జత కుదిరిందని కామెంట్స్ చేశారు. వైనాట్ 175 నినాదం కూటమి వైపుకు వీస్తోందని..ఎన్నికల్లో ప్రతిపక్షం లేని పొత్తుల ప్రభుత్వం వస్తుందన్నారు. ముచ్చటగా మూడోసారి తాను పార్లమెంట్ కు వెళ్లడం ఖాయమన్నారు. తన పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.. #mp-ram-mohan-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి