TDP MP: టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

AP: టీడీపీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక చేశారు చంద్రబాబు. ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్‌సభలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు.

New Update
TDP MP: టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

Lavu Krishna Devarayalu: టీడీపీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక చేశారు చంద్రబాబు. ఈరోజు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన టీడీపీ (TDP) పార్లమెంటరీ నేతల సమావేశం జరిగింది. ఇప్పటికే కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఉన్నారు. అయితే, పార్లమెంటరీ నేత ఎవరనేదానిపై స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. లోక్‌సభలో టీడీపీకి 16 ఎంపీల బలం ఉంది. ఈనెల 24 నుంచి లోక్‌సభ సమావేశాలు  ప్రారంభం కానున్నాయి. లోక్‌సభలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు.

వైసీపీ నుండి మొదలు..

ప్రముఖ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడైన లావు శ్రీకృష్ణదేవరాయులు 2019లో వైసీపీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. 2024లో నరసరావుపేట టికెట్ ను మాజీ మంత్రి అనిల్ కు వైసీపీకి కేటాయించింది. శ్రీకృష్ణదేవరాయులును గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడంతో ఆయన మనస్థాపానికి గురై వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి నరసరావుపేట నుంచి బరిలోకి దిగి రెండోసారి విజయం సాధించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు