Crime News: బిడ్డ మరణం తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బిడ్డ సాయి మేఘన(18) ఫిట్స్ తో మృతి చెందింది. కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఉషారాణి సైతం గుండెపోటుతో మృతి చెందింది. ఈ హృదయ విదారకరమైన ఘటన స్థానికులను కలచివేస్తోంది.

New Update
Crime News: బిడ్డ మరణం తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి

Anakapalli: కుమార్తె మరణాన్ని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ హృదయ విదారకరమైన ఘటన అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలంలో చోటుచేసుకుంది. తల్లి కూతురు ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది.

Also Read: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగి నిమ్మకాయల శ్రీనివాసరావు తన కుమార్తె సాయి మేఘన(18) , భార్య ఉషారాణి(51)తో కలిసి స్థానికంగా ఒక అపార్ట్ మెంట్ లో నివాసముంటున్నారు. సాయి మేఘన ఫిట్స్ వ్యాధితో కొంతకాలం నుంచి బాధపడుతుంది. ఈ క్రమంలోనే నేడు ఉదయం 7:30 గంటల సమయంలో ఉన్నటుండి కుమార్తె మేఘన ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు తండ్రి శ్రీనివాసరావు తెలిపారు.

Also Read: పాపం పవన్ కళ్యాణ్‌.. జనసేనకు ఎందుకు సీట్లు తగ్గించారు.. : అమర్‌నాథ్

కుమార్తె మృతదేహం వద్ద కూర్చొని ఆమె మరణ విషయం దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు ఫోన్లో తెలియజేస్తూ తల్లి ఉషారాణి సైతం అక్కడికక్కడే గుండెపోటుతో కొప్పకూలి మరణించినట్లు ఉషారాణి భర్త శ్రీనివాసరావు బోరున విలపిస్తూ తెలిపారు. ఈ హృదయ విదారకరమైన ఘటనను చూసిన స్థానికులు కంటతడి పెడుతున్నారు. భార్య ఉషారాణి, కుమార్తె అకాల మరణం చెందడంతో బాధితుడు శ్రీనివాసరావు బోరున విలపిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు