8 రోజులుగా అదే తంతు...ఉభయసభలు మళ్లీ వాయిదా

పార్లమెంట్‌ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు ప్రతిరోజూ డిమాండ్‌ చేస్తుండగా..కేంద్రం వైపు నుంచి ఆ దిశగా అడుగులు పడకపోవడంతో విపక్ష పార్టీలు మరోమారు ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయసభలు మరోసారి వాయిదా పడ్డాయి.

New Update
8 రోజులుగా అదే తంతు...ఉభయసభలు మళ్లీ వాయిదా

పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యాయి. కానీ మొదలైన రోజు నుంచే మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలంటూ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తూ వచ్చాయి. లోక్ సభ, రాజ్యసభలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. మణిపూర్‌(manipur)లోని పరిస్థితిపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండుపై విపక్ష కూటమి 'ఇండియా' సభ్యులు తమ పట్టు వీడలేదు. పైగా మోదీ ప్రభుత్వంపై వారు అవిశ్వాస తీర్మానం కూడా తెచ్చారు. గత సోమవారం రాత్రి అంతా పార్లమెంట్ బయట ధర్నాకు కూర్చున్నారు. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా వారు కోరుతున్నారు. వీరి రభసతో శుక్రవారం లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా సోమవారానికి వాయిదా పడింది

మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు శుక్రవారం కూడా డిమాండ్ చేశాయి. అందరూ రభసకు దిగడంతో సభ సమావేశమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉభయ సభల్లో లిస్ట్‌కు నిర్దేశించిన అన్ని అంశాలనూ పక్కన బెట్టి మొదట మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అలాగే మోదీ ప్రభుత్వంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగే తేదీని, సమయాన్ని లోక్ సభ స్పీకర్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని కూడా వారు కోరారు. అయితే సభలో ఏ బిల్లు పాస్ కాకుండా చూడాలన్నదే విపక్ష ఎంపీల ఉద్దేశంలా కనబడుతోందని, ముఖ్యమైన బిల్లులు సభ ఆమోదం పొందేలా సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ (prahlad joshi) అన్నారు. మణిపూర్ అంశంతో పాటు ప్రధానమైన అంశాలపై చర్చకు తాము అంగీకరించామని, కానీ వారు హఠాత్తుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు సమర్పించారని ఆయన చెప్పారు. విపక్షం నుంచి నిర్మాణాత్మక సలహాలు, సూచనలను తాము కోరుతున్నామన్నారు. అవసరమైనప్పుడు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందన్నారు.

సంప్రదాయాలను అణగదొక్కుతున్నారు

అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో స్పీకర్ అనుమతించిన తర్వాత కూడా బిల్లులను ప్రభుత్వం ఆమోదిస్తోందని, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను కాలరాయడమేనని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ఈ పార్టీ ఎంపీ మనీష్ తివారీకి, మంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హాకు మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. అంతకుముందు లోక్ సభ, రాజ్యసభల్లో విపక్ష సభ్యులు మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలంటూ వాయిదా తీర్మాన నోటీసులను అందజేశారు. పార్లమెంట్ బయట 'ఇండియా' కూటమి సభ్యులు కొంతసేపు నిరసనకు కూర్చున్నారు.

8రోజులుగా ఇదే తీరు:

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యాయి. కానీ మొదలైన రోజు నుంచే మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలంటూ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తూ వచ్చాయి. లోక్ సభ, రాజ్యసభలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. మణిపూర్ లోని పరిస్థితిపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండుపై విపక్ష కూటమి 'ఇండియా' సభ్యులు తమ పట్టు వీడలేదు. పైగా మోడీ ప్రభుత్వంపై వారు అవిశ్వాస తీర్మానం కూడా తెచ్చారు. గత సోమవారం రాత్రి అంతా పార్లమెంట్ బయట ధర్నాకు కూర్చున్నారు. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా వారు కోరుతున్నారు. వీరి రభసతో శుక్రవారం లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడగా,, రాజ్యసభ ఏకంగా సోమవారానికి వాయిదా పడింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

ప్రధాని మోదీ తమిళనాడు రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించారు. రూ.550 కోట్ల వ్యయంతో రైల్వే వంతెనను నిర్మించారు. శ్రీలంకలో 3 రోజుల పర్యటన ముగించుకొని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించారు. ఇది ఇండియాలోనే మొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్.

New Update
pambana 125412

pambana 125412

రామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పంబన్ బ్రిడ్జ్ అనే రైల్వే వంతెనను రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 72.5 మీటర్ల లిఫ్ట్ నిలువుగా చైన్ లింకప్ ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌ కోటింగ్‌తో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంకలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించారు. 

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

రామ నవమి సందర్భంగా అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే రామసేతును వీక్షించడం గురించి ప్రధాని తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది దైవిక యాదృచ్చికమని ప్రధాని అభివర్ణించారు. పూరాణాల్లో పాతుకుపోయిన ఈ పంబన్ బ్రిడ్జ్ ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఆయన చెప్పారు. రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో కలుపుతూ.. ఈ వంతెనను రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2.08 కి.మీ పొడవున్న ఈ నిర్మాణంలో 99 స్పాన్‌లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ ఉన్నాయి. ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా ట్రైన్ వెలుతుంది. కింద నుంచి ఓడలు ప్రయాణిస్తాయి. ఓడలు వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ రెండు ముక్కలుగా పైకి లేస్తోంది. ఇదే దీని స్పెషాలిటీ.

Advertisment
Advertisment
Advertisment