MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం

లిక్కర్ స్కాం కేసులో కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. వాస్తవానికి రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కవిత పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడం చర్చనీయాంశమైంది

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

MLC Kavitha Withdraw Her Bail Petition : లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. నిన్న విచారణకు కవిత తరఫున సీనియర్ న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కోరారు. పదేపదే వాయిదాలు కోరడంతో కవిత లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసులో తన బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు కవిత. వాస్తవానికి రేపు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో విచారణ జరగాల్సి ఉండగా.. కవిత పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.

Also Read : జగన్‌కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేయనున్న మరో మాజీ ఎమ్మెల్యే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment