Kavitha: నా కొడుకును కలిసేందుకు అనుమతి ఇవ్వండి.. కవిత పిటిషన్ తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కోర్టు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బంధువులను కలిసేందుకు కవితకు అనుమతినిచ్చింది. By V.J Reddy 19 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఇక శనివారం రోజు మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు కవితను కలిసిన విషయం తెలిసిందే. ALSO READ: టీడీపీలో టికెట్ల లొల్లి.. చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు మరో పిటిషన్ వెనక్కి.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని…ఈ విషయంపై ఈడీని ఆదేశించాలంటూ కవిత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయవాదులు కోరగా, అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఏడాదిగా వాయిదాలు… చివరకు కవిత దాఖలు చేసిన పిటిషన్ మీద మార్చి 24న విచారిస్తామని కోర్టు తెలిపింది. ఆరోజు కూడా వాయిదా పడి.. చివరకు 27న తొలిసారి ఈ పిటిషన్ మీద విచారణ జరిగింది. అయితే ఈ రిట్ పిటిషన్ మీద అప్పటికే ఈడీ కెవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో రెండింటినీ కలిపి ఒకేసారి విచారించింది సుప్రీంకోర్టు. అప్పటి నుంచి ఈ పిటిషన్ మీద వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యాజ్యం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సంవత్సర కాలంగా కోర్టులో నలుగుతున్న ఈ పిటిషన్ ను ఈ నెల 15న మరోమారు విచారించిన సుప్రీం, ఇరువురి తరఫు న్యాయవాదుల సుధీర్ఘ వాదనల తర్వాత ఈరోజుకి వాయిదా వేసింది. అయితే అదే రోజున కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఇక విచారణ అవసరం లేదని కవిత తరుఫు న్యాయవాదులు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. #mlc-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి