MLC Kavitha: సుప్రీం కోర్టులో కవిత రిట్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కవిత తరఫున లాయర్లు కోరారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడు రోజులు ఈడీ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే. By V.J Reddy 19 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కవిత తరఫున లాయర్లు కోరారు. ఈడీ కస్టడీ నుంచి కవితను తప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి కేటీఆర్, అడ్వకేట్ వెళ్లి కలిశారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడు రోజులు ఈడీ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే. ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత కుటుంబ సభ్యులను కలిసేందుకు ఓకే.. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఇక శనివారం రోజు మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు కవితను కలిసిన విషయం తెలిసిందే. ALSO READ: టీడీపీలో టికెట్ల లొల్లి.. చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు మరో పిటిషన్ వెనక్కి.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని…ఈ విషయంపై ఈడీని ఆదేశించాలంటూ కవిత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయవాదులు కోరగా, అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. #mlc-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి