Mla Raghunandan Rao:ఎమ్మెల్సీ కవిత,సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్ కు ఇవి కనిపించవా..ఎమ్మెల్యే రఘునందన్ రావు సీరియస్!! బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత, సీఎంఓ అధికారి స్మితాసబర్వాల్ పై సీరియస్ అయ్యారు.రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులు!! నిధులు రాక అప్పులతో బాధతో, అవమానం భరించలేక మహిళ సర్పంచ్ ఆత్మహత్యయత్నం!! మహిళా బిల్లు, మహిళ పైనా కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవిత గారికి ఇవి కనిపించవా?? By P. Sonika Chandra 17 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి Mla Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత, సీఎంఓ అధికారి స్మితాసబర్వాల్ పై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులు!! నిధులు రాక అప్పులతో బాధతో, అవమానం భరించలేక మహిళ సర్పంచ్ ఆత్మహత్యయత్నం!! మహిళా బిల్లు, మహిళ పైనా కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవిత గారికి ఇవి కనిపించవా?? మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్ష రాష్ట్ర ప్రభుత్వానికి?? పక్క రాష్ట్రంలో స్పందించే స్మిత సబర్వాల్, మహిళా కమీషనర్ సునీత రెడ్డి గారు ఎందుకు ఈ మౌనం?? దీని పై రాష్ట్ర ప్రభుత్వ వెంటనే స్పందించాలి!! అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా, నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ మంగళవారం ఆత్యహత్యాయత్నం చేశారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనుల బిల్లులు రాకపోవడం, వాటి కోసం చేసిన అప్పులు కూడా తీర్చే దారి లేక పోవడం, అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడం, సర్పంచ్ పదవి నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో తన భర్త ప్రసాద్ గౌడ్ జైలుకు వెళ్ళడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన లావణ్య గౌడ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె భర్త డెవలప్ మెంట్ ఫండ్స్ కోసమే బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీంతో అతను దాదాపు 30 లక్షలు అప్పు చేసిన గ్రామంలో సీసీ రోడ్డు, ఇంకా డ్రైనేజీ పనులు చేయించారని.. కాని గవర్నమెంట్ నుంచి బిల్లులు రాకపోవడంతో వడ్డీల భారం ఎక్కవైందని అందుకే లావణ్య ఆత్మహత్యకు యత్నించిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డియే దీనికంతటికి కారణమని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి