AP: ఆ వ్యవస్థను రూపు మాపుతా.. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ఇప్పటికే అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. ఏ ఒక్కరు అవినీతికి పాల్పడినా సహకరించేదే లేదని తేల్చిచెప్పారు. ప్రజలకు సేవ చేసే వారినే అధికారులుగా నియమిస్తామన్నారు.

New Update
AP: ఆ వ్యవస్థను రూపు మాపుతా.. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

MLA Varadarajula Reddy: అవినీతిపై పోరాటం చేస్తానన్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. అవినీతి రహిత ప్రొద్దుటూరుగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. ప్రజాధనాన్ని లక్షల రూపాయల్లో జీతాలు తీసుకుంటూ వారినే లంచం అడగటం తగదన్నారు.

Also Read: పీసీబీ ఫైల్స్‌ దహనం కేసులో కీలక పరిణామం..!

ప్రజలకు జవాబుదారితనంతో సేవాలాందించాలని.. ఏ ఒక్కరు అవినీతికి పాల్పడినా సహకరించేది లేదని తేల్చిచెప్పారు. గతంలో అధికారులు పోస్టింగ్ కోసం డబ్బులిచ్చే వ్యవస్థ ఉండేదని.. ఆ వ్యవస్థను రూపు మాపుతానని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేసే వారినే అధికారులుగా నియమిస్తామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు