AP: ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. వైద్యాధికారులపై ఆగ్రహం..! ఏలూరు జిల్లా లింగపాలెం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన మందులు, పరికరాలు గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి MLA Songa Roshan Kumar: ఏలూరు జిల్లా లింగపాలెం ప్రభుత్వ ఆసుపత్రిని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ, సిబ్బంది హాజరు రికార్డులు తనిఖీ చేశారు. ఆసుపత్రిని పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. Also Read: ఆదివాసీల ఆందోళన.. జంగూడ – గుంజీవాడ మధ్య వంతెన నిర్మించాలని డిమాండ్..! ఆసుపత్రిలో ప్రసవాలు జరగకపోవడంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గిందని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. కాలం చెల్లిన మందులు, పరికరాలు గుర్తించి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రికి సిబ్బంది కొరత ఉందని స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. #mla-songa-roshan-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి