AP: నోరు పారేసుకోకు.. నెక్ట్స్ జైలుకు వెళ్లేది నువ్వే: ఎమ్మెల్యే సోమిరెడ్డి మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఐదేళ్ళలో దోచుకున్నదంతా బయటపెడుతానన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. చంద్రబాబుపై కాకాణి నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తోడుగా కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 08 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి MLA Somireddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan) జనంలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాగా చంద్రబాబు నాయుడు ప్యాలెస్ లకు పరిమితం కాలేదని.. సీఎం అయినప్పటి నుంచి జనంలోనే ఉంటూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం సమావేశం అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. Also read: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఫైర్..! జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వ నాశనం అయిందని విమర్శలు గుప్పించారు. ఐదేళ్ళలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దోచుకున్నది బయటపెడుతానని.. చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కాకాణి గోవర్దన్ రెడ్డి చేసిన అవినీతి వారానికి ఒక సీరియల్ లా వస్తాయిని.. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తోడుగా కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. #kakani-govardhan-reddy #tdp-somi-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి