AP: ఈ ప్రాజెక్టును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే రోషన్ కుమార్ రైతుల సాగునీరు అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎర్రకాలువ ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. By Jyoshna Sappogula 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి West Godavari: రైతుల సాగునీరు అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవులపల్లి గ్రామంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం కుడి, ఎడమ కాలువల నుండి సాగునీరుని విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగమ్మకు చీర, పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also Read: ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్‌చల్ .. తెలంగాణ వ్యక్తులపై దాడి..! స్థానిక అధికారుల వద్ద నుండి ఎర్రకాలువ ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రకాలువ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఎడమ కాలువ క్రింద 5వేల ఎకరాలు , కుడి కాలువ క్రింద 10వేల ఎకరాలు ఆయకట్టులో ఉన్న కూడా దీని నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎర్రకాలువ ప్రాజెక్టును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. #mla-roshan-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి