AP: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే.. నష్టపరిహారం అందిస్తామని హామీ..!

ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలకొండ సత్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామంలో ఉన్న కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

New Update
AP: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే.. నష్టపరిహారం అందిస్తామని హామీ..!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పాలకొండసత్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన  అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం  క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే పరామర్శ.. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు.  గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. 

telugu-news | latest-news | ntr-district

Advertisment
Advertisment
Advertisment