MLA Jaya Krishna: రెండు దశాబ్దాల తర్వాత ఇలా జరిగింది.. ఎమ్మెల్యే జయకృష్ణ షాకింగ్ కామెంట్స్..! తన గెలుపు ఒక మిరాకిల్ అన్నారు పాలకొండ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. పాలకొండలో రెండు దశాబ్దాల తర్వాత తమ కుటుంబాన్ని ఆదరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొండ కోనల్లో నివసించే ఆదివాసీలకు కొండంత అండగా ఉంటానని అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 07 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి MLA Nimmaka Jayakrishna: శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. తన గెలుపు ఒక మిరాకిల్ అన్నారు. ఎమ్మెల్యే కావాలన్న తన కళను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నెరవేర్చారన్నారు. టికెట్ రాదనుకున్న తనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చారన్నారు. కూటమే తనకు గెలుపునిచ్చిందన్నారు. Also Read: రాజకీయాల్లోకి వచ్చింది ఇందుకే: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కొండ కోనల్లో నివసించే ఆదివాసీలకు కొండంత అండగా ఉంటానని అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పాలకొండలో రెండు దశాబ్దాల తర్వాత తమ కుటుంబాన్ని ఆదరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేవలం కక్షపూరితంగానే తన సొంత గ్రామం రాజాపురంలో రోడ్లు వేయలేదన్నారు. ఇరవై ఏళ్లుగా రహదారి కూడా లేకుండా చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పాలకొండ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. #mla-nimmaka-jaya-krishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి