AP: జగన్ను సాగనంపారు.. ఇక రాబోయే రోజుల్లో జరిగేది ఇదే: ఎమ్మెల్యే గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారన్నారు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ల్యాండ్, సాండ్, వైన్, మైనింగ్ అని తేడా లేకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి MLA Bolisetty Srinivas: మాజీ సీఎం జగన్ ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని తన ఇష్టారాజ్యంగా ఖూనీ చేశాడని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారన్నారు. రామన్నగూడెం గ్రామంలో జరిగిన ప్రజాదర్బార్లో ఆయన మాట్లాడారు. Also Read: వైసీపీ మాజీ మంత్రి బాలినేని అక్రమాలపై సుబ్బారావు గుప్తా ఎక్స్క్లూజివ్.! ల్యాండ్, సాండ్, వైన్, మైనింగ్ అని తేడా లేకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసిన జగన్.. సిగ్గు లేకుండా నెల రోజులకే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ఆ విమర్శల్లో జగన్ విశ్వసనీయత తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందని.. రాబోయే రోజుల్లో ప్రజలు నచ్చే, మెచ్చే విధంగా పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. #mla-bolisetty-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి