MLA Balineni: వైసీపీ మీటింగ్కు డుమ్మా.. థియేటర్లో చిల్ అవుతున్న ఎమ్మెల్యే బాలినేని..! ప్రకాశం జిల్లా కొండేపిలో జరుగుతున్న వైసీపీ కీలక నేతల సమావేశానికి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే బాలినేని. మీటింగ్కు డుమ్మా కొట్టిన ఆయన హైదరాబాద్ లో AMB మాల్ లో గుంటూరు కారం సినిమా చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. By Jyoshna Sappogula 12 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి MLA Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా కొండేపిలో జరుగుతున్న వైసీపీ కీలక నేతల సమావేశానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి దూరంగా ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ని తనకిస్తానని జగన్ క్లారిటీ ఇవ్వకపోవడం, ఒంగోలు ఎంపీ సీటు విషయంలో మాగుంట కుటుంబానికి టికెట్ ఇస్తానని హామీ ఇవ్వకపోవడంతో దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: వైసీపీ నుండి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఔట్? దూరంగా మాగుంట ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా ఈ రోజు కొండేపిలో జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నారు. వైసీపీ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. ఒంగోలు ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరఫున టికెట్ మాగుంటకు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. బాలినేని శ్రీనివాసులురెడ్డి ఎంపీ టికెట్ మాగుంట కుటుంబానికి ఇవ్వాలని పట్టుబడుతున్నా.. జగన్ మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఎంపీగా విక్రాంత్ రెడ్డి? ఒంగోలు ఎంపీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి సీటు ఇవ్వనున్నారని వైసీపీ పార్టీ వర్గాల సమాచారం. మాగుంట కూడా ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఈ రోజు ఒంగోల్లోనే ఉన్న ఎంపీ మాగుంట.. కొండేపి వైసీపీ సమావేశానికి దూరంగా ఉన్నారు. Also Read: ‘ కాపు, బలిజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు’.. ఓవి.రమణ కీలక వ్యాఖ్యలు అంతా తానై మీటింగ్ కు డుమ్మా కొట్టిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని హైదరాబాద్ కు వెళ్లారు. AMB మాల్ లో గుంటూరు కారం సినిమా చూస్తున్న ఫొటోలు సోషల్ మీడియా గ్రూపులలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటి వరకూ అంతా తానై నడిపిన బాలినేని.. వైసీపీ మొదటి లిస్టు విడుదల నుంచి తన మాటను అధిష్టానం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు. అందుకే.. తనకి ఏమి సబంధం లేదనట్లు హైదరాబాద్ వెళ్లిపోయారు. #mp-magunta-srinivasulu #ycp-mla-balineni-srinivasa-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి