Mizoram Elections: మిజోరంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో జోరం పీపుల్స్ మూవ్ మెంట్ ఇటీవల దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా.. నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఆదివారం ముగిసింది. ఫలితాలు ప్రకటించారు. మిజోరంలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. తొలి రౌండ్లలో జోరం పీపుల్స్ మూవ్ మెంట్ పార్టీ ఆధిక్యంలో ఉంది. By KVD Varma 04 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Mizoram Elections: మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలతో పాటె ఇక్కడ కూడా ఎన్నికలు జరిగాయి. అయితే, ఓట్ల లెక్కింపు ఇక్కడ సోమవారం జరుగుతోంది. ముందు ఇక్కడ కూడా ఆదివారమే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్నా.. స్థానికంగా వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో సోమవారం నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. దాంతో ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 45 నిమిషాల్లోనే జోరం పీపుల్స్ మూవ్ మెంట్ (జెడ్పీఎం) మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. Mizoram Elections: జోరం పీపుల్స్ మూవ్ మెంట్ (జెడ్పీఎం) 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. Also Read: ఇండియా కూటమికి పరాభవం.. తెలంగాణ మినహా అంతటా నిరాశే! జోరం పీపుల్స్ మూవ్ మెంట్ నాయకుడు లాల్దుహోమా. లాల్దుహోమా మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన పార్టీ రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. 2018లో జెడ్పీఎంకు 8 సీట్లు వచ్చాయి. మిజోరాం ఎగ్జిట్ పోల్స్ లో లాల్ దుహోమా పార్టీ జెడ్పీఎం ఆధిక్యం వస్తుందని సూచించాయి. ఈ పార్టీ చీఫ్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ చీఫ్ గా పనిచేశారు. 1984లో కాంగ్రెస్ లో చేరి ఎంపీ అయ్యారు. అయితే తర్వాత ఆయన కాంగ్రెస్ ను వీడారు. మిజోరంలో 5 ఎగ్జిట్ పోల్స్ లో(Mizoram Elections) జోరం పీపుల్స్ మూవ్ మెంట్ (జెడ్పీఎం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది. మిగిలిన 4 సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)కు 15, జెడ్పీఎంకు 16, కాంగ్రెస్కు 7, బీజేపీకి 1 సీట్లు వస్తాయని తేలింది. Watch this interesting Video: #election-results #mizoram-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి