Hyderabad News: వీడు మనిషి కాదు రాక్షసుడు.. పోర్న్ చూస్తూ కన్నకూతురుని ఏం చేశాడంటే! హైదరాబాద్ మియాపూర్ బాలిక వసంత మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. బాలిక తండ్రి బానోతు నరేష్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన తండ్రి .. తన కోరిక తీర్చాలంటూ కూతురు వసంతపై ఒత్తిడి చేశాడు. అమ్మకు చెప్తానని బాలిక అరవడంతో చంపేశాడు. By Jyoshna Sappogula 19 Jun 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: నాన్న.. ఈ పేరంటేనే కూతుర్లకు ఒక బలం, ఒక భరోసా. ఏ తండ్రైనా కన్న బిడ్డను ఎంతో ప్రేమగా పెంచి అన్ని విధాలుగా తోడుగా ఉంటూ తన భవిష్యత్త్ కు బాటలు వేస్తాడు. అలాంటది ఓ కన్న తండ్రే కూతురికి కాలయముడైయ్యాడు. పోర్న్ వీడియోలు చూస్తూ రాక్షసుడిగా మారిన తండ్రి కూతురిని కోరిక తీర్చాలంటూ వేధించాడు. అయితే, కూతురు అమ్మకు చెబుతానని హెచ్చరించడంతో అతి దారుణంగా కొట్టి చంపాడు. Also Read: గన్‌తో బెదిరించి లేడి కానిస్టేబుల్‌ను రేప్ చేసిన ఎస్సై కోరిక తీర్చాలంటూ.. హైదరాబాద్ మియాపూర్ బాలిక వసంత మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. బాలిక తండ్రి బానోతు నరేష్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. సీసీ ఫుటేజి ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. ఇంటికి సమీపంలోనే బాలిక వసంత డెడ్‌బాడీ గుర్తించారు. పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన తండ్రి బానోతు నరేష్.. తన కోరిక తీర్చాలంటూ సొంత కూతురు వసంతపై ఒత్తిడి చేశాడు. 11 నిమిషాల్లోనే అమ్మకు చెప్తానని బాలిక అరవడంతో నరేష్ కూతురిని చంపేశాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి తలను నేలకేసి కొట్టి హత్య చేశాడు. 11 నిమిషాల్లోనే బాలికను హత్య చేసిన నరేష్.. చనిపోయిందా లేదా అని మరోసారి వెళ్లి చెక్ చేశాడు. వరుసగా మూడు రోజుల పాటు బాలిక డెడ్‌బాడీని చెక్ చేస్తూ వచ్చాడు. Also Read: డ్యామ్ లో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో అస్థిపంజరాలు! వలస వచ్చిన 15 రోజులకే.. తర్వాత కూతురు మిస్ అయిందని భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బానోతు నరేష్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మణ్ తండా. బతుకుదెరువు కోసం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చాడు. వలస వచ్చిన 15 రోజులకే నరేష్ కూతురుని హత్య చేశాడు. #miyapur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి