MODI: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు.. తాజా షెడ్యూల్ ఇదే.. మరో రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్ర నేతలందరూ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ పెద్దలు తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. By BalaMurali Krishna 27 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MODI: మరో రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్ర నేతలందరూ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ పెద్దలు తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా మోదీ-షా ద్వయం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుస పర్యటనలు చేసి క్యాడర్‌లో జోష్ నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సార్లు రాష్ట్ర పర్యటనకు రాగా.. తాజా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ఖారారైంది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. తాజా షెడ్యూల్ ఇదే.. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు బేగంపేట బదులు శంషాబాద్ విమాశ్రయానికి రానున్నారు. అక్టోబర్ 1 మధ్యాహ్నం 1:30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మోదీ ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1:35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్‌కు బయలుదేరనున్నారు. 2:10 గంటలకు మహబూబ్ నగర్ హెలిపాడ్ వద్దకు చేరుకుని 2:15 గంటల నుంచి 2:50 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం 3 గంటల నుంచి 4 గంటల వరకు పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రసంగం తర్వాత 4:10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 4:50 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీ తిరుగు పయనమవుతారు. తెలంగాణ బీజేపీ శ్రేణులు మోదీ పర్యటనపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన పర్యటనతో బీజేపీలో మళ్లీ జోష్ పెరుగుతుందన్న భావన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. కేసీఆర్ స్వాగతం పలుకుతారా..? శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధాని ఏం మాట్లాడుతారు? తెలంగాణకు ఏమైనా హామీలు ఇస్తారా? అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధాని రాష్ట్రాల పర్యటనకు వచ్చిన సమయంలో సాధారణంగా సీఎం స్వాగతం పలుకుతుంటారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇటీవల ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లడం లేదు. ఆయన స్థానంలో ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఎంకు స్వాగతం పలుకుతున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి ఆ ఐదుగురు కీలక నేతలు? #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి