ప్రతి నియోజక వర్గంలోని 3 వేల మందికి ముందుగా గృహలక్ష్మి..క్లారిటీ ఇచ్చిన మంత్రి! తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై తీవ్ర గందరగోళం నెలకొన్న నేప్యథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ స్కీమ్ పై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన నోట్ రిలీజ్ చేశారు. మొదటి దశలో.. ప్రతి నియోజకవర్గంలో ముందుగా 3 వేల ఇళ్లు ఇస్తామని అవి పూర్తయిన తరువాతే రెండో దశ కోసం దరఖాస్తులను స్వీకరించబడుతుందన్నారు. By P. Sonika Chandra 09 Aug 2023 in తెలంగాణ Uncategorized New Update షేర్ చేయండి తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేప్యథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ స్కీమ్ పై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన నోట్ రిలీజ్ చేశారు ఆయన. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని ఆయన ఫైర్ అయ్యారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ కంఠంలోని పాత ఇళ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని..దాంతో ఇంటి నెంబర్ లేనప్పటికీ ఖాళీ స్థలం ఉన్నవారు ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు ప్రజాప్రతినిధులతో కలెక్టర్లకు దరఖాస్తులు పంపించవచ్చన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అయితే మొదటి దశలో.. ప్రతి నియోజకవర్గంలో ముందుగా 3 వేల ఇళ్లు ఇస్తామని అవి పూర్తయిన తరువాతే రెండో దశ కోసం దరఖాస్తులను స్వీకరించబడుతుందన్నారు.మొదటి విడతలో ఈ నెల 10 వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ అని ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ స్కీమ్ కు చాలా తక్కువ గడువు ఉండడంతో దరఖాస్తు చేసుకోవడానికి జనం ప్రభుత్వ కార్యాలయాలకు క్యూ కట్టారు. ఇక ఈ స్కీమ్ పై సొంత పార్టీ శ్రేణులకే క్లారిటీ లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ బంధులాగే అంతా కన్ఫ్యూజన్ ఉండడంతో ప్రజలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మరి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఈ గందరగోళానికి చెక్ పడుతుందో లేదో చూడాలి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి