ఒక వ్యక్తి పేరు విని అవాక్కయిన మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్.!

కోనసీమ జిల్లా అల్లవరంలో ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వివరిస్తున్నారు మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్. అయితే, ఒక లబ్ది దారుని పేరు రేవు అబద్దం విని అవాక్కయ్యాడు." ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ.. చెప్పు అబద్ధం ఇవన్నీ నిజమా కాదా చెప్పు అబద్ధం అంటూ చమత్కారించారు.

New Update
ఒక వ్యక్తి పేరు విని అవాక్కయిన మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్.!

Minister Vishwaroop's son Srikanth: అంబెద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరంలో మంత్రి విశ్వరూప్ తనయుడు డా. శ్రీకాంత్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఇంటింటికీ తీసుకెళుతున్న క్రమంలో జరిగిన ఒక సన్నివేశం అందరిని కడుపుబ్బ నవ్వించింది. అల్లవరం మండలంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువేస్తున్నారు శ్రీకాంత్.

Also Read: నవంబర్ 30న సెలవు ఇవాల్సిందే..ఈసీ హెచ్చరిక.!

పర్యటనలో భాగంగా ఒక ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ ఒక లబ్ది దారుని పేరు విని అవాక్కయ్యారు. లబ్ది దారుని పేరు రేవు అబద్దం. రేవు అబద్దం ..ఇదేం పేరు ఎప్పుడు వినలేదంటూ సరదాగా మాట్లాడారు. నిజంగా నీ పేరు అబద్ధమా అంటూ చమత్కారించాడు. నీ పేరు అబద్ధమేమో మీకు అందిన పథకాలన్నీ నిజమే.. అవునా.. కాదా.. అంటూ మంత్రి కుమారుడు శ్రీకాంత్ నవ్వించారు.

అబద్ధం నీకు ఇచ్చిన పథకాలు నిజం, అవునా.. కాదా.. అంటూ ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ.. చెప్పు అబద్ధం ఇవన్నీ నిజమా కాదా.. చెప్పు అబద్ధం.. అంటూ చమత్కారం ఆడారు. డ్వాక్రా రుణమాఫీ వచ్చిందా? లేదా? అబద్ధం చెప్పు.. అబద్ధం చెప్పకు అబద్ధం.. అంటూ కామిడి చేశారు. డ్వాక్రా రుణమాఫీ ప్రతినెల పెన్షన్ తో పాటు లక్ష ఇరవై ఒక్క వేలు మీకందిందా? లేదా?.. నిజం చెప్పు అబద్ధం.. అంటూ అబద్దాన్ని అడిగారు. దీంతో అక్కడ కాసేపు అందరూ సరదాగా నవ్వుకున్నారు. అయితే అందరిని సరదాగా నవ్విస్తూ కలుపుకుని వెళుతూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు శ్రీకాంత్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రీతిలో ట్రెండ్ అవుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు