Sandhya Rani: అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి: మంత్రి సంధ్యారాణి

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మన తన భేదం లేకుండా అందరికీ సంక్షేమ అందేలా చూస్తామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన తప్పులను తాము చెయ్యమన్నారు. గడచిన ప్రభుత్వంలో ఏ ఒక్క కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదని విమర్శలు గుప్పించారు.

New Update
Sandhya Rani: అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి: మంత్రి సంధ్యారాణి

Vizianagaram: గడచిన ప్రభుత్వంలో ఏ ఒక్క కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రైతులకు పంట నష్ట పరిహారం ఊసే లేదన్నారు. వైద్యంలో హాస్పిటల్స్ అన్నిటిని గాడిలో పెట్టవలసిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా 11 ప్రాజెక్టులు ఉన్నా సాగునీరు త్రాగునీరుకి ఇబ్బందులు తప్ప లేదన్నారు.

Also Read: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ సునీల్ హెచ్చరిక..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన తన భేదం లేకుండా అందరికీ సంక్షేమ అందేలా చూస్తామన్నారు. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన తప్పులను తాము చెయ్యమన్నారు. శాసనమండలి అదొక దేవాలయమని..అయితే, గత ప్రభుత్వం తనను పలు విధాలుగా ఇబ్బందులు పెట్టిందని వాపోయారు. అందుకే వైసీపీ 151 సీట్లు నుండి 11 సీట్లుకు పడిపోయిందని విమర్శలు గుప్పించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు