Minister Ponnam: నేను ఏం అలగలేదు.. అవి తప్పుడు వార్తలు.. మంత్రి పొన్నం క్లారిటీ TG: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద తాను అలిగినట్లు వచ్చిన వార్తలను ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ వార్తలు అవాస్తవం అని చెప్పారు. అమ్మవారి భక్తులు ఎందుకు అలుగుతామన్నారు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందన్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. By V.J Reddy 09 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister Ponnam: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద తాను అలిగినట్లు వచ్చిన వార్తలపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను అలిగానని వచ్చిన వార్తలు అవాస్తవం అని అన్నారు. అమ్మవారి భక్తులు ఎందుకు అలుగుతాం? అని చెప్పారు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందని అన్నారు. మేయర్ కూడా తోపులాటలో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. తోపులాట నిలువరించేందుకు కొద్దిసేపు ఆగినట్లు క్లారిటీ ఇచ్చారు. తోపులాటపై అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. మహిళా రిపోర్టర్‌కి ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం అని అన్నారు. అసలేం జరిగింది.. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలు వచ్చినా సరైన సెక్యూరిటీ లేదని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించలేదని కోపంతో గుడిబయటే కూర్చున్నారు మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. అధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై అధికారులను నిలదీశారు మేయర్ విజయలక్ష్మి. ఈ క్రమంలో మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మికి అధికారులు సర్ది చెప్పారు. కాగా ఈరోజు ఎల్లమ్మ కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి కొండా సురేఖ. అమ్మవారి దర్శనానికి పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణనోత్సవ ఏర్పాట్లపై విమర్శలు వస్తున్నాయి #minister-ponnam-prabhakar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి