Peddi Reddy: వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో లబ్ధిదారులకు వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అబద్ధపు హామీలు ఇచ్చి మాట తప్పడమే కాక మేనిఫెస్టోను ఆన్లైన్లో డిలీట్ చేసిన మోసకారి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Peddi Reddy: వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddi Reddy: సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.

వైయస్సార్ ఆసరా పేరుతో రాష్ట్రంలోని ప్రతి అక్క చెల్లెమ్మలకు రుణభారం తగ్గించిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డిదన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన ఘనత జగనకే దక్కుతుందన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి మాట తప్పడమే కాక మేనిఫెస్టోను ఆన్లైన్లో డిలీట్ చేసిన మోసకారి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చేసిన మోసం వలనే వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని కామెంట్స్ చేశారు.

Also Read: ఈవీఎంలపై భయాందోళనలు అనవసరమన్న ఎన్నికల కమిషనర్‌..

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందించేవారన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేదల పక్షాన నిలబడి వారి అవసరాలు తీరుస్తున్నారని చెప్పుకొచ్చారు. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు.

14 సంవత్సరాల పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మేలు చెప్పుకోవడానికి ఒక పథకం కూడా లేదన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతిలో చేసిన అభివృద్ధి వాన నీటి పాలయిందన్నారు. సొంత పార్టీ నాయకులకు దోచిపెట్టిన నాయకుడు చంద్రబాబు అయితే సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజలకు పంచిపెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కామెంట్స్ చేశారు.  చంద్రబాబు నాయుడు చెప్పేదొకటి చేసేది ఒకటి అన్నట్లు నిరుద్యోగ భృతి ఇస్తానన్న ఆయన ఉన్న ఉద్యోగులను తొలగించాడని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు