AP: పిడుగురాళ్లలో 80 డయేరియా కేసులు: మంత్రి నారాయణ పల్నాడు జిల్లాలో డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి బోర్లను పరిశీలించారు. డయేరియా బాధితులను పరామర్శించారు. లెనిన్ నగర్, మారుతి నగర్లో పూర్తిగా డ్రైనేజీ క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు. By Jyoshna Sappogula 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Minister Narayana: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లెనిన్ నగర్, మారుతి నగర్ లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి బోర్లను పరిశీలించారు. స్వయంగా కొంతమంది ఇళ్లకు వెళ్లి నీటి సరఫరా, వాడకంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెనిన్ నగర్ పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. Also Read: జగన్‌ను సాగనంపారు.. ఇక రాబోయే రోజుల్లో జరిగేది ఇదే: ఎమ్మెల్యే డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. పిడుగురాళ్లలో 80 డయేరియా కేసులు నమోదయ్యాయన్నారు. 39 కేసులు రిఫరెన్స్ కేసులుగా గుర్తించినట్లు తెలిపారు. ఇద్దరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. మారుతి నగర్, లెనిన్ నగర్లో ఏక్కువగా కేసులు వస్తున్నాయన్నారు. Also Read: చెల్లీ, బుజ్జీ అంటూ.. పండంటి కాపురంలో కానిస్టేబుల్ చిచ్చు! పైపుల ద్వారా వచ్చే కృష్ణా వాటర్ లీకులు రావడం ద్వారా బోరు వాటర్ వాడటం జరిగిందని..బోరు వాటర్ వాడిన ఐదు రోజుల్లో కేసులు వచ్చాయని తెలిపారు. విజయవాడ ల్యాబ్ టెస్ట్ లు వచ్చిన తరువాత బోర్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. వాటర్ ను వేడి చేసి తాగాలన్నారు. లెనిన్ నగర్, మారుతి నగర్లో పూర్తిగా డ్రైనేజీ క్లీన్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఖాళీ స్థలాల్లో కూడా పిచ్చి మొక్కలను తొలగించమని ఆదేశించినట్లు తెలిపారు. #minister-narayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి