పవన్ కల్యాణ్‌కు మంత్రి కారుమూరి సవాల్.. అలా చేస్తే ఉరేసుకుంటా వారాహి యాత్రలో సీఎం జగన్, ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లుపై పవన్ చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోయాయి. By BalaMurali Krishna 15 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి మాటల దూకుడు పెంచిన సేనాని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో రెండో దశ వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ప్రభుత్వంపై పవన్ విమర్శల ఘాటు పెంచారు. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. ఏకవచనంతో సంభోదిస్తూ రాజకీయాలు హీటెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే వాలంటీర్లుపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక రేపాయి. ఎంతలా అంటే పవన్ దిష్టి బొమ్మలు తగలబెట్టడంతో పాటు కేసులు పెట్టడం వరకు పరిస్థితి వెళ్లింది. శుక్రవారం రాత్రి తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో అయితే పవన్ తన మాటల దూకుడు మరింత పెంచారు. తణుకు సెంటర్‌లో ఉరేసుకుంటా.. పవన్ విమర్శలకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. తణుకు బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. వాలంటీర్స్‌లో ఒక్కరైనా అరెస్ట్ అయితే తణుకు సెంటర్లో ఉరివేసుకుంటానని సవాల్ విసిరారు. . వాలంటీర్ల వ్యవస్థపై పవన్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో వాలంటీర్లు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆ సమయంలో పవన్ హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. వాలంటీర్స్ డబ్బుల కోసం పని చేసే వ్యక్తులు కాదని స్పష్టంచేశారు. పవన్ కళ్యాణ్ లేగిస్తే రూ.1000 కోట్లు సంపాదిస్తాను అంటారు.. మరి ఎక్కడ నుంచి సంపాదిస్తారో తెలియదన్నారు. టీడీఆర్ బాండ్స్ కోసం రూ.309 కోట్లు అవినీతి జరిగిందన్నారని.. మరి ఆ స్కీంలో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ హయాంలో టీడీఆర్ బాండ్స్ అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో ఏంచేశారు? సీఎం జగన్ పరిపాలనలో దేవస్థానాలకు గౌరవం దక్కిందన్నారు. పురోహితుల వేలంపాట ఆరోపణలు అర్ధరహితమని... ఈవో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఆ రోజే దేవాదాయశాఖ మంత్రి వేలం పాటని ఆపేశారని గుర్తుచేశారు. గత చంద్రబాబు హయాంలో 400 ఆలయాలను కూల్చి వేస్తే పవన్ ఎక్కడున్నారు? అని నిలదీశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని మంత్రి ఆరోపించారు. తణుకులో ఒక్క బెల్ట్ షాపునైనా చూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని కారుమూరి ఛాలెంజ్ చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి