AP: జగన్.. నీకు ఆ అర్హతే లేదు: మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ సీఎం జగన్‌కు వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హతే లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది జగనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తో కుమ్మక్కై జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 20 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Minister Gottipati Ravi Kumar : వైసీపీ (YCP) అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) తీవ్ర విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా జగన్ కు ఏ మాత్రం లేదని అన్నారు. ఈ ప్రాజెక్టుకు జగనే గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు. Also Read: ప్రాణాలు తీస్తున్న రైళ్లు.. పదేళ్లలో 2.60 లక్షల మంది! గతంలో ప్రకాశం జిల్లా నేతలమంతా చంద్రబాబు సూచనతో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లామని.. వెలిగొండ ప్రాజెక్టు కోసం అప్పటి కేంద్ర మంత్రిని కలిశామని చెప్పారు. అయితే, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో అధికారంలో ఉన్న జగన్ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని జగన్ ఐదేళ్ల పాటు నాశనం చేశారని మండిపడ్డారు. Also Read: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సెక్రటేరియట్ ముందు మీ అయ్య విగ్రహం పెట్టుకుంటావా! వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఫైర్ అయ్యారు. పులిచింతల గేటు కూడా కొట్టుకుపోయిందని విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన ఇసుక దోపిడీతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల భద్రతకు ముప్పు వాటిల్లిందని అన్నారు. జగన్ కొంత కాలం పాటు నోరు తెరవకపోవడమే మంచిదని.. లేదంటే ప్రజలు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. #gottipati-ravi-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి