AP: మదనపల్లె అగ్నిప్రమాద ఘటన.. వారిపైనే అనుమానం: మంత్రి అనగాని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే తమకు అనుమానం ఉందన్నారు. వేయి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందన్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Minister anagani satya prasad: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పి పుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి వేయి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందన్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉందన్నారు. నిబంధనలకు విరుద్దంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందన్నారు. ల్యాండ్ కన్వెర్షన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్దం ఘటన జరిగిందని తెలిపారు. పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే తమకు అనుమానం ఉందన్నారు. ఆర్డీఓ, ఎమ్మార్వో సహా ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ సీజ్ చేశామన్నారు. ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి ఆరోపణల ఫైళ్లు మాయం అవుతున్నాయని.. దగ్దం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సరిగ్గా పని చేయాలని .. లేదంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ అవినీతిని కప్పి పుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. Also Read: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..! #anagani-satya-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి