Ambati: టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారు.. మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..! టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారన్నారు మంత్రి అంబటి. ఎన్నికల సంఘం వేటు వేసిన ప్రాంతాల్లోనే దాడులు జరిగాయన్నారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని దీనిపై చర్యలు తీసుకోవాలని సిట్ చీఫ్ ను కొరినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 20 May 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Minister Ambati: సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ను వైసీపీ నేతల బృందం కలిసింది. పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై పారదర్శకంగా విచారణ జరుపాలని కోరారు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ జరిగని విధంగా పోలింగ్ తరువాత జరిగిన ఘటనలపై చాలా మంది IPS అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసిందన్నారు. Also Read: ఉత్కంఠ రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు కేసు.. ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమైందా? తాము మొదటి నుండి టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని చెబుతున్నామన్నారు. తాము వినీత్ బ్రీజ్ లాల్ ను కలిశామని..ప్రాధమిక రిపోర్ట్ మాత్రమే ఇచ్చామని బ్రీజ్ లాల్ చెప్పారన్నారు. ఫైనల్ నివేదిక సిద్ధం కాలేదని తెలిపారన్నారు. గతంలో పురందేశ్వరి ఫిర్యాదు చేసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిందని.. ఎన్నికల సంఘం వేటు వేసిన ప్రాంతాల్లోనే దాడులు జరిగాయని కామెంట్స్ చేశారు. Also Read: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.! జిల్లాల మీద అవగాహన కలిగిన అధికారులను మార్చి.. కనీసం అవగాహన లేని అధికారులను తెచ్చి పెట్టారని విమర్శలు గుప్పించారు. ఇది కుట్ర పూరితంగా జరిగిందని ఆరోపించారు. పోలీసులు టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారని.. అందుకే మూడు జిల్లాల్లో తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సిట్ చీఫ్ ను కొరామన్నారు. 307 సెక్షన్ పెట్టాల్సిన ప్రాంతాల్లో చిన్న చిన్న సెక్షన్స్ పెట్టారన్నారు. న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు. #minister-ambati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి