తెలంగాణకు పసుపు హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు వాతావరణం

తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

New Update
తెలంగాణకు పసుపు హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు వాతావరణం

Telangana: తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రమంతటా పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు తప్పకుండా ఇళ్లలోనే ఉండాలని పేర్కొన్నది. కాలుష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యత చాలావరకూ తగ్గిందని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టంచేసింది.

ఇది కూడా చదవండి: పంజాగుట్ట ఇన్స్పెక్టర్‎పై సస్పెన్షన్ వేటు.. మాజీ ఎమ్మెల్యే కొడుకును కేసు నుంచి తప్పించే ప్రయత్నం

ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్:
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బుధ, గురు వారాల్లో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు తీవ్రంగా ఉండే అవకాశముందని వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు