Chiranjeevi: త్రిషపై నటుడి హాట్ కామెంట్స్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్..!

నటి త్రిష పై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.

New Update
Chiranjeevi:  త్రిషపై నటుడి హాట్ కామెంట్స్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్..!

Chiranjeevi Reacts on Mansoor Ali khan comments: ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మన్సూర్ ఆలీఖాన్.. 'లియో' చిత్రంలో నటి త్రిష పై అత్యాచార సన్నివేశం లేకపోవడం చాలా బాధాకరమని మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. మన్సూర్ అలీఖాన్ త్రిష పై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల పై ఇప్పటికే మహిళా కమీషన్ తీవ్రంగా స్పందిస్తూ కేసు నమోదు చేయాలనీ తమిళనాడు పోలీసులకు జారీ చేసింది. ఇక ఈ వ్యాఖ్యల పై పలువురు సెలబ్రెటీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు నితిన్, మంత్రి రోజా ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని ఖండించారు.

Also Read: త్రిష రేప్‌ సీన్‌ ఇష్యూపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌.. ఏం చెప్పిందంటే

తాజాగా ఈ వివాదం పై మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ వేదిక పై స్పందించారు. "తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ త్రిష పై చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కు మాత్రమే కాదు ప్రతీ అమ్మాయికి ఇబ్బంది కలిగేలా అసహ్యంగా ఉన్నాయన్నారు. మన్సూర్ అలీఖాన్ వక్ర బుద్దితో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో త్రిషకు మాత్రమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలకు బాధితులైన ప్రతీ మహిళకు అండగా ఉంటానని" తెలిపారు. మెగాస్టార్ ఈ విషయం పై స్పందించడంతో.. ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ళను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని మన్సూర్ అలీఖాన్ పై కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Prabhas New Movie: వార్ నేపథ్యంలో ప్రభాస్ మూవీ.. ఆ దర్శకుడి క్రేజీ ప్రాజెక్ట్.. బడ్జెట్ ఎంతంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు