Chiranjeevi: సంతోషంగా ఉంది.. కేసీఆర్‎ను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా పరామర్శిస్తున్నారు. సోమవారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న మెగాస్టార్ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

New Update
Chiranjeevi: సంతోషంగా ఉంది.. కేసీఆర్‎ను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

KCR - Chiranjeevi: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా పరామర్శిస్తున్నారు. సోమవారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న మెగాస్టార్ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యంగా, హుషారుగా కనిపించారని.. ఆరు వారాల్లో కోలుకునే అవకాశాలున్నట్లు వైద్యులు చెప్పారని చిరంజీవి తెలిపారు. తాను కేసీఆర్ ను కలిసిన సమయంలో ఆ పరిస్థితిలోనూ ఇండస్ట్రీ యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం సంతోషం కలిగించిందన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేసీఆర్ ను పరామర్శించారు. డాక్టర్లను అడిగి కేసీఆర్ ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. మంత్రులు షబ్బీర్ అలీ, సీతక్క కూడా రేవంత్ వెంట వెళ్లి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సోమవారం హాస్పిటల్ లో కేసీఆర్ ను పరామర్శించారు. అంతకుముందు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ను పరామర్శించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు