Varun Tej- Lavanya: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెగా కపుల్.. వీడియో వైరల్..!

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పూర్తి చేసుకున్న.. వరుణ్, లావణ్య దంపతులు తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కొత్త దంపతులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

New Update
Varun Tej- Lavanya: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెగా కపుల్.. వీడియో వైరల్..!

Varun Tej- Lavanya: మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలు ఇటలీలోని (Italy) టుస్కానీలో ఘనంగా జరిగాయి. నవంబర్ 1 న ఈ జంట తెలుగు సాంప్రదాయం ప్రకారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో మూడు రోజుల పాటు.. వీరి పెళ్లి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకల్లో అల్లు, మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సెలెబ్రెటీస్ కూడా సందడి చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వరుణ్, లావణ్య పెళ్లి అంగ రంగ వైభవంగా జరిగింది. వరుణ్, లావణ్య పెళ్లి వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో  అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Varun Tej- Lavanya

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పూర్తి చేసుకున్న.. మెగా కపుల్ తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇటలీలో పెళ్లి వేడుకల తర్వాత.. లావణ్య మెగా కోడలి హోదాలో హైదరాబాద్ చేరుకుంది. ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఈ జంటకు  గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటికే పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన మెగా ఫ్యామిలీ, రామ్ చరణ్, ఉపాసన దంపతులు, పవన్ కళ్యాణ్, వైష్ణవ, శిరీష్, సాయి ధరమ్ తేజ్, కూడా హైదరాబాద్ వచ్చేశారు.

ఇక సినీ ప్రముఖుల కోసం ఈ నెల నవంబర్ 5 న హైదరాబాద్ లో గ్రాండ్ రెసెప్షన్ ఏర్పాటు చేశారు. రెసెప్షన్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. ఈ వేడుకలకు సెలెబ్రెటీస్, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు.

Also Read: Varun Tej- Lavanya: వరుణ్ బరాత్ లో నాగబాబు, నిహారిక డాన్స్ వీడియో వైరల్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు