AP: అందరూ ఇలానే ఉండాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం..!

అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యులు సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

New Update
AP: అందరూ ఇలానే ఉండాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం..!

NDA Meeting: అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యులు సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయాంపై చట్ట ప్రకారం ముందుకెళ్దామని, చట్టం తన పని తను చేస్తుందంటూ సీఎం చెప్పారు. సాండ్ పాలసీలో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ సూచించారు. కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలంటూ దిశా నిర్దేశం చేశారు.

ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వేసే కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకోవాలని కోరారు.

Also Read: కూటమిని సింగిల్‌ డిజిట్‌ కు పరిమితం చేస్తాం.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు