ఆగని హింస బస్సులకు, ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!

మణిపూర్‌ లో దుండగలు మరోసారి రెచ్చిపోయారు. మణిపూర్ లో చెలరేగిన మంటలు ఇప్పుడప్పుడే ఆరే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మోరే జిల్లాలో దుండగులు ఎన్నో ఇళ్లకు నిప్పు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని బస్సులను కూడా తగలబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

author-image
By Bhavana
New Update
ఆగని హింస బస్సులకు, ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!

మణిపూర్‌ లో దుండగలు మరోసారి రెచ్చిపోయారు. మణిపూర్ లో చెలరేగిన మంటలు ఇప్పుడప్పుడే ఆరే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మోరే జిల్లాలో దుండగులు ఎన్నో ఇళ్లకు నిప్పు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని బస్సులను కూడా తగలబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

manipur mob violence houses torches houses and buses

పోలీసు సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే బస్సులకు నిందితులు నిప్పు పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవలే అక్కడ ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతో దేశం అట్టుడుకింది.

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా విపక్షాలు ఈ అంశం గురించి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఈ అంశాల గురించి ప్రస్తావిస్తూ సీఎం బీరెన్ నేను రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదని గట్టిగా చెప్పారు.

‘నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే ప్రశ్నే లేదు. కానీ, కేంద్ర నాయకత్వం, మణిపూర్ ప్రజలు కోరుకుంటే నేను పదవిని వదిలేస్తాను’ అని ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతేకాకుండా నేను ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిని. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను.మణిపూర్ లో వీలైనంత త్వరగా శాంతి భద్రతలు, శాంతిని పునరుద్ధరించడమే ప్రస్తుతం నా ముందు ఉన్న ప్రధాన లక్ష్యం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment