80 రోజుల తర్వాత.... ఇంటర్నెట్ పునరుద్దరణ...!

మణిపూర్ లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 80 రోజుల తర్వాత బ్రాడ్ బ్యాండ్ సేవలను పునరుద్దరిస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంటర్నెట్ పై నిషేధం ఎత్తి వేయాలంటూ పలు వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

New Update
80 రోజుల తర్వాత.... ఇంటర్నెట్ పునరుద్దరణ...!

మణిపూర్ లో బ్రాడ్ బాండ్ సేవలను పునరుద్ధరించారు. కొన్న ప్రత్యేకమైన నిబంధనల కింద వినియోగదారుల నుంచి లిఖిత పూర్వక పత్రాలను తీసుకుని బ్రాడ్ బాండ్ సేవలను పునరుద్దరించనున్నట్టు రాష్ట్ర హోం శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొబైల్ డేటా సేవలపై ఇంకా నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

Manipur lifts ban on broadband internet

మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో మే3న రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలపై హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. రాష్ట్రంలో సుమారు 80 రోజులుగా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచి పోయాయి. సాధారణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు చెప్పింది.

ఇంటర్నెట్ పై నిషేధం వల్ల రాష్ట్రంలో పలు వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ఆస్పత్రులు, ఎల్పీజీ గ్యాస్ సంస్థలు, న్యాయ వ్యవస్థ, వర్క్ ఫ్రమ్ హోం చేసే వ్యక్తులు ఇలా పలు వర్గాలపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. దీంతో పౌర సేవలకు ఇబ్బంది కలుగుతోంది వివరించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం స్టాటిక్ ఐపీ ద్వారా మాత్రమే అందించనున్నట్టు అధికారులు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అనుమతించిన కనెక్షన్లను తప్ప మరే ఇతర కనెక్షన్లను సబ్ స్క్రైబర్లు అనుమతించరాదని ప్రభుత్వం సూచించింది. వైఫై, హాట్ స్పాట్ రౌటర్లను అనుమతించబోమని తేల్చి చెప్పింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు