పక్క రాష్ట్రాల విషయాల్లో జోక్యం వద్దు.... మిజోరాం సీఎంపై బీరెన్ సింగ్ ఫైర్...!

New Update
పక్క రాష్ట్రాల విషయాల్లో జోక్యం వద్దు.... మిజోరాం సీఎంపై బీరెన్ సింగ్ ఫైర్...!

మిజోరాం సీఎం జోరంతంగాపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుంటే మంచిదని సూచించారు. మణిపూర్ లో అక్రమ వసలదారులను తమ ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. త్వరలోనే వారందరినీ తమ ప్రభుత్వం రాష్ట్రం నుంచి బయటకు పంపిస్తుందన్నారు.

publive-image

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం బీరెన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అక్రమ వలసలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. అంతే కానీ రాష్ట్రంలో ఎంతో కాలంగా వుంటున్న కుకీ ప్రజలకు తాము వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలన్న కొన్ని అల్లరి మూకల ఆలోచనల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎలాంటి బెదిరింపులకు తమ ప్రభుత్వం లొంగదన్నారు. మిజోరాంలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో తనను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఆయన ఖండించారు. తమ రాష్ట్ర విషయాల్లో జోరంతంగ జోక్యం చేసుకోవాల్సిన పని లేదన్నారు.

రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదని ఆయన చెప్పారు. అల్లర్లను అదుపు చేయడంలో కేంద్ర బలగాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్దరించడానికి, సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు