తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు.. లెక్కలు చూస్తే కళ్లు బైర్లుకమ్మాల్సిందే..

తెలంగాణలో ఎన్నికల పండుగ ఎఫెక్ట్ కారణంగా మద్యం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. రోజుకు రూ. 188 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది రూ. 200 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 4 శాతం మద్యం విక్రయాలు పెరగగా.. బీర్ల విక్రయాలు మాత్రం ఏకంగా 13 శాతం పెరిగాయి. దసరా, దీపావళి పండుగలు, అసెంబ్లీ ఎన్నికలే మద్యం విక్రయాల పెరుగుదలకు కారణం అని భావిస్తున్నారు అధికారులు.

New Update
తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు.. లెక్కలు చూస్తే కళ్లు బైర్లుకమ్మాల్సిందే..

Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో ఓటర్లను తమవైపు లాగేందుకు, వారిని ప్రలోభ పెట్టేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు చేయాల్సినదంతా చేస్తున్నారు. డబ్బులు, గిఫ్ట్‌లు, మద్యం పంపిణీ షరామామూలుగానే మారిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తాజాగా అధికారులు వెల్లడించిన లెక్కలు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి.

2022లో ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ నెలలో మద్యం అమ్మకాలు ఇప్పటికే 4% పైగా పెరిగాయి . రూ. 1,965 కోట్ల నుండి రూ. 2,055 కోట్లకు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ముఖ్యంగా బీర్ల అమ్మకాలు 13% పెరగడం గమనార్హం. అయితే, ఈ గణాంకాలు అక్టోబర్ 24 వరకు మాత్రమే ఉన్నాయి. ఈ నెల చివరి వారంలో మరింత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయానికి(డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి) అంతకు ముందు ఏడాది అంటే నవంబర్ 2017 తో పోలిస్తే లెక్కలు విరుద్ధంగా ఉన్నాయి. అప్పుడు ఏకంగా 36 శాతం విక్రయాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. గతేడాదికి, ప్రస్తుతానికి లెక్కలు చూస్తే బిత్తరపోయే పరిస్థితి ఉంది.

ఇక ఈ ఐదేళ్ల మధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికల కాలంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు ఘనాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మద్యం అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మద్యం విక్రయాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని అంచనా. ఇక మద్యం దుకాణాలపై జరిమానాలు కూడా విధిస్తున్నారు అధికారులు. అయినప్పటికీ.. ఏదో ఒక మార్గంలో విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. మరి క్రమంగా పెరుగుతున్న మద్యం విక్రయాలకు ఎన్నికలే ఏకైక కారణమా? కాదా? అనేది అస్పష్టమైనప్పటికీ.. ఎన్నికల తేదీ సమీపిస్తున్నా కొద్ది అమ్మకాలు మరింత పెరుగుతాయనేది మాత్రం స్పష్టం అవుతోంది.

అధికారిక లెక్కలు ఇలా ఉన్నాయి..

అక్టోబరు 2023లో 19.5 లక్షల కేసుల విదేశీ మద్యం (IMFL) అమ్ముడయ్యింది. అక్టోబర్ 2022 నుండి పరిశీలిస్తే ఇది 6.8% వృద్ధిని నమోదు చేసింది. ఇక 34.2 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 13% పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 24న రోజువారీ విక్రయాలు దాదాపు రూ.188 కోట్లకు చేరుకోగా, త్వరలో రూ. 200 కోట్లను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. అక్టోబరు 24వ తేదీ వరకు ఉన్న లెక్కలను గమనిస్తే.. ఎన్నికలే కాకుండా.. దసరా పండుగ సందర్భంగా కూడా ఈ అమ్మకాలు పెరగడానికి కారణంగా పేర్కొంటున్నారు అధికారులు.

మద్యంపై నిషేధం విధించాలి..

తెలంగాణలో భారీగా పెరుగుతున్న మద్యం విక్రయాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం పంపిణీ చేస్తోందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. మద్యం విక్రయాలు, రవాణాపై నిషేధం విధించాలని భారత ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఈ మేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా సమర్పించారు.

Also Read:

శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!

ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment