Twins: కవల పిల్లలు.. ఈ పదం వినగానే మనందరిలో ఏదో తెలియని ఒక ఆసక్తి కలుగుతుంది. అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండే వీరిని చూసి తల్లిదండ్రులు, బంధువులు మురిసిపోతుంటారు. బయటవారైతే ఎవరు ఎవరో కూడా గుర్తుపట్టలేక తంటాలు పడుతుంటారు. ఇలా కవలలు ఉన్న ఇంట్లోనే కాదు చుట్టపక్కల కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది. Also Read : శీతాకాలంలో ఈ పండు తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు! అసలు తల్లి కావడం అనేది ప్రతీ తల్లికి ఓ అపురూపమైన ఘట్టం. ఓ రూపానికి పురుడు పోయడానికి ఆ తల్లి ఎన్నో కష్టాలను ఇష్టంగా భరిస్తుంది. అదే కవలలు జన్మిస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. Also Read : ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం కవలలు ఎందుకు పుడతారంటే..! కవల పిల్లలు జన్మించడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. పురుషులలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యే శుక్రకణాలు మహిళల్లోని అండంతో ఫలదీకరణం చెందడం వల్లనే పునరుత్పత్తి జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఒక్కోసారి మహిళల్లో రెండు అండాలు విడుదలై, శుక్రకణం ఆ రెండు అండాలతో ఒకే సారి ఫలదీకరణం చెందినప్పుడు కవలలు పుడుతారట. Also Read : బ్రెయిన్ స్ట్రోక్.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు! అయితే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 130 మిలియన్ల ట్విన్స్ ఉన్నారని 2006లో ఓ సర్వే ద్వారా బయటపడింది. Also Read: జగిత్యాల గురుకులంలో కలకలం.. ఇద్దరు విద్యార్థులకు పాము కాటు!