Stress: రోజూ 30 నిమిషాలు ఇలా చేస్తే మీ స్ట్రెస్ దూరం.! ఇటీవలే పూణేలోని EY కంపెనీలో పని ఒత్తిడితో 26 ఏళ్ళ యువతి మరణించిన ఘటన అందరి మనసుల్ని కలచివేసింది. అయితే రోజూ దినచర్యలో కొన్ని అలవాట్లను పాటించడం వల్ల ఒత్తిడిని కాస్త తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 06 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 రిలాక్సేషన్ టెక్నిక్స్ ఒత్తిడి ఎక్కువైనప్పుడు నెమ్మదిగా డీప్ బ్రీత్ తీసుకొని వదలాలాలి. ఇలా చేయడం నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. దీని వల్ల ఒత్తిడి ప్రభావం కొంతవరకు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 2/7 వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. శారీరక శ్రమ శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది సహజ ఒత్తిడి నివారణగా పనిచేస్తుంది. 20-30 నిమిషాల పాటు వాకింగ్, యోగా, స్ట్రెచింగ్ వంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. 3/7 నాణ్యమైన నిద్ర నిద్రలేమి ఒత్తిడికి ముఖ్య కారణంగా ఉంటుంది. మనిషికి ప్రతిరోజూ 7-9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు పడుకునే ముందు ఫోన్స్, ల్యాప్ టిప్స్ చూడడం నివారించాలి. మెరుగైన నిద్ర కోసం మంచి వాతావరణాన్ని ఎంచుకోవాలి. 4/7 సమయ నిర్వహణ ఒక వ్యక్తి జీవితంలో సమయ నిర్వహ అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులను ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయడం వల్ల పని చేస్తున్నప్పుడు ఒత్తిడి అనే భావన కలగదు. 5/7 కెఫీన్ తక్కువగా తీసుకోండి చాలా ఆఫీస్ లో ఒత్తిడిగా ఉన్నప్పుడు టీ, కాఫీ ఎక్కువగా తాగడం చేస్తుంటారు. కానీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలో కెఫీన్ కంటెంట్ హార్ట్ రేట్, ఆందోళనను పెంచుతుంది. ఇది మానసిక స్థితి పై ప్రభావం చూపుతుంది. కాఫీ మాత్రమే కాదు ఇతర కెఫీన్ ప్రాడక్ట్స్ కూడా తక్కువగా తీసుకోవడం మంచిది. 6/7 ప్రతికూల ఆలోచనలు నెగటివ్ థాట్స్ ఒత్తిడిని మరింత పెంచుతాయి. పని చేసేటప్పుడు నేను చేయలేనేమో..? నా వల్ల కాదేమో అనే ఆలోచనలో మానసిక ఆందోళనను పెంచి ఒత్తిడిని కలిగిస్తాయి. ఎల్లప్పుడూ సానుకూల భావంగా ఉండడానికి ప్రయత్నించాలి. అదే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. 7/7 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి