షాకింగ్ న్యూస్.. పైనాపిల్ తినే వాళ్లకి ఇదే ఎచ్చరికే!

సాధారణంగా పైనాపిల్ లో పుష్కలమైన పోషకాలు ఉంటారు. ఏ సీజన్ లోనైనా ఈ పండును తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణుల అభిప్రాయం. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వైరల్ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

New Update
pineapple00

pineapple

Pineapple: చాలా మంది  పైనాపిల్ లోని చల్లని గుణాల కారణంగా చలికాలంలో  దీనిని తొనొచ్చా? లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే  నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ సీజన్ లోనైనా పైనాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిది. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాదు వాతావరణ మార్పుల కారణంగా సంభవించే అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పైనాపిల్‌లోని  బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే కడుపులో మంటను తగ్గిస్తుంది. చలికాలంలో పైనాపిల్ చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీనిలోని  విటమిన్ సి చర్మ కణాలను రిపేర్ చేసి మెరిసేలా చేస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారడం వంటి సమస్యలను కూడా  తగ్గిస్తుంది.

pineapple 11

వారికి మంచిది కాదు  

అయితే చలికాలంలో  పైనాపిల్ తీసుకోవడం అందరికీ ప్రయోజనకరంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొందరికి పైనాపిల్ అలర్జీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు దీనిని తింటే కడుపులో చికాకును ఎదుర్కొంటారు. అలాగే  అసిడిటీ లేదా పొట్టలో అల్సర్ సమస్యలు ఉన్నవారికి ఇది  ఇబ్బందిని కలిగిస్తుంది ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ వంటి పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు కూడా పైనాపిల్‌కు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు