అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా

డయాబెటిస్‌ ఉన్నవారిలో తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, అధిక ఆకలి, వేడి, చెమటలు పట్టడం, యూరిన్ ఇన్‌ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అలాగే శరీరంలో షుగర్ స్థాయిలను పరీక్షించుకోవాలి

New Update
బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్నారా..?

Diabetes

Diabetes: ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ జీవితకాల వ్యాధికి అన్ని వయసుల స్త్రీలు, పురుషులు భాదితులు అవుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత రక్తంలోని చక్కర స్థాయిలను అధికంగా పెంచును. ఇది మధుమేహ సమస్యకు దారి తీయును. మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ,మధుమేహ సమస్య శరీరంలో ఇతర అవయవాల పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు, అధిక బరువు, హెరిడీటీ, ఇన్సులిన్ నిరోధకత ఈ వ్యాధికి కారణమవుతాయి. మధుమేహ సమస్య ఉన్న వారు ప్రతి రోజు వాకింగ్, ఆహరం పై శ్రద్ధ పెట్టడం ద్వారా  చేస్తే రక్తంలోని చక్కర స్థాయిలను నితంత్రించడానికి సహాయపడును. 

అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో కొన్ని లక్షణాలు తరచుగా కనిపించడం మధుమేహానికి సంకేతమని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తరచుగా మూత్రవిసర్జన, అధిక ఆకలి, దాహం

 డయాబెటిస్‌ ఉన్నవారిలో  తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, అధిక ఆకలి, వేడి, చెమటలు పట్టడం, యూరిన్ ఇన్‌ఫెక్షన్ వంటి లక్షణాలు ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి..  శరీరంలో షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

మధుమేహం సమస్య ఉన్న వారు వాకింగ్ చేస్తే కలిగే లాభాలు

అధిక బరువు

ఉదయం లేవగానే వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజూ వాకింగ్ చేయడం ద్వారా శరీరంలో అధిక కొవ్వును కరిగించును. దీని వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. అలాగే మధుమేహ సమస్య ఉన్న వారిలో ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని తగ్గించును.

రక్తంలో చక్కర స్థాయిలు 

మధుమేహం ఉన్నవారు ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంతో పాటు శరీరంలోని కణాలు గ్లూకోజ్ సమర్థవంతంగా ఉపయోగించుకునేలా సహాయపడును. దీని వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రనలో ఉంటాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు