కేక్‌ తింటే క్యాన్సర్‌ వస్తుందా? డాక్టర్ల హెచ్చరిక ఇదే!

సాధారణంగా ప్రతీ సెలెబ్రేషన్స్ లో కేక్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ కేక్ లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు. తాజాగా కర్ణాటక ఆహార భద్రత విభాగం.. బెంగళూర్ లో సేకరించిన కేక్‌ శాంపిల్స్ లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లుగా గుర్తించింది.

New Update

Cake Causes Cancer:  సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదైనా శుభకార్యం, బర్త్ డే వేడుకలను కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకోవడం అందరికీ అలవాటు. అయితే కేకులు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు. తాజాగా కర్ణాటక ప్రభుత్వ ఆహార భద్రత విభాగం బెంగళూరులో సేకరించిన కేక్ శాంపిల్స్ ను పరిశీలించగా.. వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 235 శాంపిల్స్ ను పరిశీలించగా.. అందులో 12 కేకుల్లో కృత్రిమ రంగులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. రెడ్‌ వెల్వెట్‌, బ్లాక్‌ ఫారెస్ట్‌ లాంటి కేక్‌లలో కృత్రిమ రంగుల కల్తీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే కృత్రిమ ఫుడ్ కలర్స్ క్యాన్సర్ కు దారితీస్తాయి. ముఖ్యంగా ఈ కృత్రిమ రంగులు బెంజిడిన్, 4-అమినోబిఫెనిల్,  4-అమినోఅజోబెంజీన్ వంటి క్యాన్సర్ కారకాలతో కలుషితమైనప్పుడు వ్యాధి ప్రమాదం మరింత పెరుగుతుంది. అంతేకాదు ఇవి శారీరక, మానసిక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు పరిశోధకులు. 

Also Read: 'మా ఇంట మహాలక్ష్మి పుట్టింది'.. తల్లిదండ్రులైన రాకింగ్‌ రాకేష్, సుజాత

క్యాన్సర్‌కు కారణమయ్యే ఆహార పదార్ధాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ముందుగా కృత్రిమ ఆహార రంగుల గురించి అవగాహన పొందండి. దీని వల్ల ప్రాడక్ట్ లేబుల్ పై ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి మంచివా..? కాదా..? అనే విషయాన్ని గుర్తించవచ్చు. ఒకవేళ ప్రాడక్ట్ పై లేబుల్ లేకపోయినా, ఇండీగ్రీడియంట్స్ అనుమానాస్పదంగా కనిపించినా..  దానిని తినకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఎక్కువ రంగు కనిపించే ఉత్పత్తులకు దూరంగా ఉండండి. 

ఇది ఇలా ఉంటే రీసెంట్ గా  పంజాబ్‌లోని పాటియాలాలో పుట్టినరోజు నాడు కేక్ తిని ఓ బాలిక మృతి చెందిన ఘటన ఎంతో మంది మనసుల్ని కలచివేసింది. దీనిపై పోలీసులు విచారణ జరపగా బేకరీలో సరైన ఉష్ణోగ్రత వద్ద కేక్ నిల్వ చేయలేదని తేలింది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఆ బేకరీపై ఆరోగ్య శాఖ చలాన్ జారీ చేయడంతో పాటు సిబ్బందిని అరెస్టు చేశారు. 

Also Read:  Online Cakes: కేక్ చెడిపోయిందని ఎలా గుర్తించాలి.. ఆన్లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..?

Advertisment
Advertisment
తాజా కథనాలు