Smartphone Usage: ప్రతిరోజూ మనం చూస్తున్నాం, అన్ని వయసులవారు స్మార్ట్‌ఫోన్‌కి అతిగా అలవాటుపడుతున్నారు. కానీ, ఈ అలవాటులో కొన్ని పొరపాట్లు మనకు పెద్ద సమస్యలు తెస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే, తక్కువ నిద్ర, ఎక్కువ సమయం స్క్రీన్ ముందే గడపడం, శారీరిక శ్రమకి దూరం అవ్వడం. Also Read : శీతాకాలంలో ఈ పండు తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు! పరిశోధనల ప్రకారం, స్మార్ట్‌ఫోన్ వాడకం ఎక్కువ అయితే మానసిక ఒత్తిడీ, శారీరక సమస్యలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా, ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్ చూసే వాళ్లు త్వరగా ముసలివాళ్లలా అనిపించడమే కాకుండా, వారి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. Also Read : వీర్యంతో ముఖ సౌందర్యం.. సెలబ్రిటీల సీక్రెట్ ఇదేనా! ఇంకొక ముఖ్యమైన విషయమేమంటే, ఎక్కువ సమయం స్క్రీన్ చూడడం వల్ల నడుము నొప్పి, కళ్ళ మీద ఒత్తిడీ ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. Also Read : ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం స్మార్ట్‌ఫోన్ వాడే సమయాన్ని కంట్రోల్ చేయడం, హెల్తీ అలవాట్లను పెంపొందించడం అత్యంత అవసరం. రోజులో కొంత సమయం ఫోన్ పక్కన పెట్టి, పుస్తకాలు చదవడం, బయట తిరగడం, ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టడం మన ఆరోగ్యం కోసం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Rlso Read: ఉదయాన్నే పసుపు నీరు తాగితే అనేక వ్యాధులు దూరం.. వారం చూడండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.