ఈ వయసు వారు రోజూ ఇంత సమయం నడవాల్సిందే..! లేదంటే కష్టమే

ప్రతీ రోజు కొంతసమయం వాకింగ్ చేయడం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వయసు ప్రకారం ఏ వయసు వారు ఎన్ని నిమిషాలు నడవాలి అనేది తెలుసుకోవడానికి ఈ పూర్తి ఆర్టికల్ చదవండి.

New Update
walking..2

daily walking

Walking:  నేటి బిజీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం చాలా కష్టంగా మారిపోయింది. అయితే ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ కొంత సమయం వాకింగ్ కి కేటాయిస్తే శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. ప్రతీ ఒక్కరు తమ వయసు ప్రకారం ఎంత సమయం వాకింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also Read :  ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

వయస్సు ప్రకారం ఎన్ని నిమిషాలు నడవాలి?

ప్రతిరోజూ కొంత సమయం వాకింగ్ చేయడం ఒత్తిడిని తగ్గించడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే ఎముకలు, కండరాళ్ళను కూడా బలపరుస్తుంది. అనేక వ్యాధులను కూడా దూరం చేస్తుంది. 

  • 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వారు ప్రతి రోజూ 60 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వయసులో హార్మోనల్ మార్పుల కారణంగా శరీరంలో, బరువులో  చాలా వస్తాయి. ఇలాంటి సమయంలో రోజూ కొంతసేపు వాకింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. 
  • 31 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు వారు రోజూ 30 నుంచి  45 నిమిషాల పాటు నడవడం ఆరోగ్యానికి మంచిది. ఇది వారి మానసిక ఒత్తిడితో పాటు అనేక జీవనశైలి వ్యాధులను నివారించడంలో తోడ్పడుతుంది. 

Morning walking

  • 66 నుంచి 75 సంవత్సరాల వయసు వారు ప్రతీరోజు 20 నుంచి 30 నడిస్తే సరిపోతుంది. ఇది వృద్ధాప్య వయసు.. వారు ఎక్కువగా నడవలేరు అందుకే కొంత సమయం కేటాయిస్తే సరిపోతుంది. 
  • 75 అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు 15 నుంచి 20 నిముషాలు వాకింగ్ సరిపోతుంది. ఇదిది వారి మానసిక పరిస్థితి,  ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read: టాయిలెట్ పై కూర్చొని గంటలు గంటలు గర్ల్ ఫ్రెండ్ తో సొల్లేస్తున్నారా..? జాగ్రత్త

Advertisment
Advertisment
తాజా కథనాలు