మీరు తాగే వాటర్ బాటిల్‏లో లక్షల ప్లాస్టిక్ కణాలు! టెన్షన్ పడొద్దు.. ఇలా చేయండి

కొత్త పరిశోధనలలో శాస్త్రవేత్తలు నీటి నుంచి 90% వరకు మైక్రోప్లాస్టిక్ కణాలను తొలగించడానికి సులభమైన పద్దతిని కనిపెట్టారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

New Update
microplastic in water (1)

microplastic in water

Microplastic in Water: ప్రతి రోజూ మిలియన్ల మైక్రోప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి  ప్రవేస్తున్నాయని  మీకు తెలుసా..? అవును..  రోజూ ప్లాస్టిక్ బౌల్స్ , ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో తాగే నీరు, తినే ఆహారం ద్వారా కంటికి కనిపించని లక్షల మైక్రోప్లాస్టిక్‌ కణాలు శరీరంలోకి వెళుతున్నాయి. వీటి ద్వారా మాత్రమే కాదు కుళాయి, పంపు  నీటిలో కూడా మైక్రోప్లాస్టిక్‌ కణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.  ఇవి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, ఫుడ్ అలర్జీస్, హార్మోన్ అసమతుల్యతలు వంటి అనేక సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు నిపుణుల. అంతేకాదు ఇవి క్రమంగా శరీరంలో రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తాయి. అయితే కొత్త పరిశోధనలలో శాస్త్రవేత్తలు నీటి నుంచి 90% వరకు మైక్రోప్లాస్టిక్ కణాలను తొలగించడానికి సులభమైన పద్దతిని కనిపెట్టారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

నీటిలో మైక్రోప్లాస్టిక్ లను ఇలా తొలగించండి.. 

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యయనం ప్రకారం .. ఒక లీటర్ వాటర్ బాటిల్లో దాదాపు  2.40 లక్షల మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయి. దీనిలో 90% నానోప్లాస్టిక్‌.. వీటిని కళ్ళతో చూడలేము. సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం.. నీటిని మరిగించి ఫిల్టర్ చేయడం ద్వారా లక్షల మైక్రో, నానోప్లాస్టిక్ కణాలు తొలగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పద్ధతి 90% ప్లాస్టిక్ కణాలను తొలగించడంలో విజయవంతమైందని కనుగొన్నారు. మరిగించిన తర్వాత నీటిని స్ట్రైనర్‌తో ఫిల్టర్ చేసి తాగడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా కుళాయి, పంపు  నీటిని తాగే వారు ఈ సులభమైన పద్ధతి ద్వారా నీటిలో మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలను తొలగించవచ్చు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

Advertisment
Advertisment
తాజా కథనాలు