అధిక బరువు ఉన్నవారికి వచ్చే సమస్యలు ఇవే! అధిక బరువు అనేక అనర్ధాలకు కారణం. చిన్న వయసులోనే ఈ సమస్య ఏర్పడితే తగ్గించే విధానాలపై శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటినా వారిలో అధిక బరువు గుండె సంబంధిత కలిగించే ప్రమాదం ఉంది. సరైన ఆహరం, శారీరక శ్రమతో అధిక బరువును తగ్గించవచ్చు. By Archana 26 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update over weight షేర్ చేయండి Over weight: నేటి బిజీ బిజీ లైఫ్ లో అనారోగ్యంగా జీవన శైలి విధానాలు, ఆహరపు అలవాట్లు కారణంగా చాలా మందిలో ఊబకాయ సమస్య సర్వ సాధారణంగా మారుతోంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు పెరుగుతున్నారు. ఇది క్రమంగా ఊబకాయం సమస్యకు దారితీస్తుందిముఖ్యంగా మహిళలు ఊబకాయం సమస్యకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే చిన్న వయసులోనే అధిక బరువు ఏర్పడితే.. తగ్గించే విధానాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. Also Read: ఎంతోమంది హీరోయిన్స్ తో నటించినా.. వీళ్లిద్దరే ప్రభాస్ ఫేవరేట్ ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ అయితే BMI(Body mass index) ప్రకారం ఒక వ్యక్తి ఎంత బరువు ఉండాలి అనేది ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత దాన్ని అలాగే మెంటెయిన్ చేయాలి. BMI సూచించిన కంటే తక్కువ బరువు ఉంటే పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు. అలాంటి వారు ఆహరం పై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటినా వారిలో అధిక బరువు స్ట్రోక్ వంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ ఒక సందర్భంలో వెల్లడించింది. ఆరోగ్యకరమైన ఆహారం తినడం...శారీరక శ్రమతో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలను తగ్గించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఊబకాయం కారణాలు చెడు ఆహరపు అలవాట్లు చాలామంది తిండిపై శ్రద్ధ వహించరు. సమయానికి తినకపోవడం, బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు బరువు పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల జీర్ణక్రియ చెడుగా ప్రభావితం అవుతుంది. ఒత్తిడి ఒత్తిడి కూడా శరీర బరువు పెరగడానికి కారణం. ఒత్తిడి కారణంగా శరీరంలో 'కార్టిసాల్ 'హార్మన్ పెరుగుతుంది. ఇది శరీర బరువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది . ఇంట్లో, ఆఫీస్‌లో పని భారం ఎక్కువైనప్పుడు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు రోజులో కొంత సమయాన్ని తమ కోసం కేటాయించాలి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: Ganesh Chaturthi 2024: చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం చేయాలి..? - Rtvlive.com మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి