ఇలాంటి టపాసులను మాత్రమే కొనండి.. లేదంటే ప్రమాదాలు తప్పవు! దీపావళి రోజున టపాసులను పేల్చేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి కొన్ని సురక్షితమైన చర్యలు తీసుకోవాలి. బాణాసంచా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 29 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 ఒకప్పుడు దీపావళి అంటే దీపాల పండగ.. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి దీపావళి అంటే టపాసుల పండగ అన్నట్లుగా అయిపొయింది. టపాసులను పేల్చడం వల్ల పర్యావరణానికి హాని జరగడంతో పాటు పలు చోట్లల ఎంతో మంది గాయాల పాలవుతుంటారు. అంతే కాదు ప్రమాదవశాత్తు ఎన్నో అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 2/8 అందువల్ల మీరు మీ కుటుంబ సభ్యులు టపాసులను పేల్చేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి కొన్ని సురక్షితమైన చర్యలు తీసుకోవాలి. బాణాసంచా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 3/8 బ్రాండెడ్ పటాకులు ప్రమాదాలను నివారించడానికి బ్రాండెడ్ పటాకులు కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. కొంత మంది తెలిసి తెలియక నాణ్యతలేని పటాకులను తీసుకుంటారు. ఇలాంటి క్రాకర్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే రసాయనాలను కలిగి ఉంటాయి. ప్రభుత్వ సంస్థలచే లైసెన్స్ పొందిన టపాసులను మాత్రమే కొనండి. 4/8 క్రాకర్లను సురక్షితమైన ప్రదేశంలో నిల్వ చేయండి.. ఫైర్‌క్రాకర్లు కిచెన్ వంటి ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలి. పొరపాటున చిన్నపాటి అగ్గిరవ్వ వాటి పై పడినా.. అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది. పాలిథిలిన్ బ్యాగ్‌ల కంటే కలపతో కంటైనర్లను నిల్వ చేయండి. 5/8 కాటన్ దుస్తువులు ధరించండి పట్టు, నైలాన్, పాలిస్టర్, వంటి బట్టలు సులభంగా అంటుకునే ప్రమాదం ఉంటుంది. అందుకని క్రాకర్లను కాల్చేటప్పుడు కాటన్, డెనిమ్, ఖాదీతో తయారు చేసిన బట్టలను ధరించడం సురక్షితం. 6/8 నీళ్లు లేదా ఇసుక క్రాకర్లను పేల్చేటప్పుడు ముందు జాగ్రత్తగా ఒక బకెట్ నీరు , ఇసుకను మీ సమీపంలో ఉంచుకోండి. తద్వారా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 7/8 బహిరంగా ప్రదేశాల్లో క్రాకర్లును పేల్చండి క్లోజ్డ్ ఏరియాస్ లేదా జనాభా ఉన్న ప్రాంతాల్లో క్రాకర్లును పేల్చడం ప్రమాదకరం. క్రాకర్ల ఒక్క అగ్గి రవ్వ పడినా.. ప్రాణ హానీ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదాలను నివారించడానికి బహిరంగ ప్రదేశాల్లో టపాసులను కాల్చాలి. అలాగే రాకెట్ వంటి క్రాకర్లు కాల్చేటప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్, పరికరాలను గమనించుకోవాలి. 8/8 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి