వీటిని తిన్నారో.. ఒంట్లో కొవ్వు కొండ పెరిగినట్లు పెరుగుతుంది జాగ్రత్త! శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం.. By Archana 16 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 నేటి బిజీ లైఫ్ లో తినే ఆహరం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి లేదంటే.. అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి జీవనశైలి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడే వారి సమస్య ఎక్కువ. 2/6 అధిక మొత్తలో కొవ్వు, కేలరీలు, షుగర్స్ కలిగిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం.. శారీరక సమస్య తక్కువగా చేయడం ఊబకాయం సమస్యకు దారితీస్తుంది. ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు తగిన శారీరక శ్రమ చేయకపోతే, అవి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి. 3/6 అయితే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం.. 4/6 ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. రెడ్ మీట్ లోని సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. 5/6 అధిక స్వీట్లు, చక్కెర ప్రాడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. స్వీట్లు LDL కొలెస్ట్రాల్ స్థాయిల పెరుగుదలకు కారణమవుతాయి. దీని వల్ల మధుమేహం, గుండె జబ్బుల తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. 6/6 చిప్స్, ఫ్రైస్, పకోరస్ మరియు కచోరీస్ వంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా పెంచుతాయి. ఈ ఆహారాలను నూనెలో వేయించినప్పుడు వీటిలోని క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. కావున వేయించిన ఆహార పదార్థాలు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి